top of page

​శుభ సోమవారం 

శివ 004.jpg

పశూనాం పతిం పాపనాశం పరేశం
గజేంద్రస్య కృత్తిం వసానం వరేణ్యమ్ |
జటాజూటమధ్యే స్ఫురద్గాంగవారిం
మహాదేవమేకం స్మరామి స్మరారిమ్ || ౧ ||

మహేశం సురేశం సురారాతినాశం
విభుం విశ్వనాథం విభూత్యంగభూషమ్ |
విరూపాక్షమింద్వర్కవహ్నిత్రినేత్రం
సదానందమీడే ప్రభుం పంచవక్త్రమ్ || ౨ ||

గిరీశం గణేశం గళే నీలవర్ణం
గవేంద్రాధిరూఢం గుణాతీతరూపమ్ |
భవం భాస్వరం భస్మనా భూషితాంగం
భవానీకలత్రం భజే పంచవక్త్రమ్ || ౩ ||

శివాకాంత శంభో శశాంకార్ధమౌళే
మహేశాన శూలిన్ జటాజూటధారిన్ |
త్వమేకో జగద్వ్యాపకో విశ్వరూపః
ప్రసీద ప్రసీద ప్రభో పూర్ణరూప || ౪ ||

పరాత్మానమేకం జగద్బీజమాద్యం
నిరీహం నిరాకారమోంకారవేద్యమ్ |
యతో జాయతే పాల్యతే యేన విశ్వం
తమీశం భజే లీయతే యత్ర విశ్వమ్ || ౫ ||

న భూమిర్న చాపో న వహ్నిర్న వాయు-
-ర్న చాకాశమాస్తే న తంద్రా న నిద్రా |
న గ్రీష్మో న శీతం న దేశో న వేషో
న యస్యాస్తి మూర్తిస్త్రిమూర్తిం తమీడే || ౬ ||

అజం శాశ్వతం కారణం కారణానాం
శివం కేవలం భాసకం భాసకానామ్ |
తురీయం తమఃపారమాద్యంతహీనం
ప్రపద్యే పరం పావనం ద్వైతహీనమ్ || ౭ ||

నమస్తే నమస్తే విభో విశ్వమూర్తే
నమస్తే నమస్తే చిదానందమూర్తే |
నమస్తే నమస్తే తపోయోగగమ్య
నమస్తే నమస్తే శ్రుతిజ్ఞానగమ్య || ౮ ||

ప్రభో శూలపాణే విభో విశ్వనాథ
మహాదేవ శంభో మహేశ త్రినేత్ర |
శివాకాంత శాంత స్మరారే పురారే
త్వదన్యో వరేణ్యో న మాన్యో న గణ్యః || ౯ ||

శంభో మహేశ కరుణామయ శూలపాణే
గౌరీపతే పశుపతే పశుపాశనాశిన్ |
కాశీపతే కరుణయా జగదేతదేక-
-స్త్వం హంసి పాసి విదధాసి మహేశ్వరోఽసి || ౧౦ ||

త్వత్తో జగద్భవతి దేవ భవ స్మరారే
త్వయ్యేవ తిష్ఠతి జగన్మృడ విశ్వనాథ |
త్వయ్యేవ గచ్ఛతి లయం జగదేతదీశ
లింగాత్మకే హర చరాచరవిశ్వరూపిన్ || ౧౧ ||

ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమచ్ఛంకరాచార్య విరచితం వేదసార శివ స్తోత్రం సంపూర్ణమ్ |

advt001.jfif
tatavarti002.jfif
tatavarti001.jfif

సంస్కృత ​పాఠం 

శ్రీరామ (29).

(సులభంగా సంస్కృతం నేర్చుకుందాం).

హరిః ఓం

శ్రీ గురుభ్యోనమః.

శ్రీ మహా గణాధిపతయే నమః.

శ్రీ మహాసరస్వత్యై నమః.

శ్రీ కాశీ కృష్ణాచార్య గురుభ్యోనమః.

----------

ఈరోజు ( ) 29 వ పాఠం చెప్పుకుందాం.

29. ఏకోనత్రింశః పాఠః ( ఇరువది తొమ్మిదవ పాఠము ).

అంతకు ముందు అష్టా వింశః (28 వ) పాఠంలో అభ్యాసానికి ఇచ్చిన తెలుగు వాక్యములకు బ్రాకెట్ లో సంస్కృత వాక్యములను ఇచ్చాను.

మీరు వ్రాసిన వాక్యములతో సరిచూసుకుని అవసరమైన సవరణలు చేపట్టగలరు.

అభ్యాసము (28).

1. నా అన్నను పిలుచుటకు ఎవరు వెళ్ళినారు ?

( మమ అగ్రజం ఆహ్వాతుం కే అగచ్ఛన్ ? ).

2. ఎవరును వెళ్ళనిచో మీరే వెళ్ళుడు.

(కే అపి న అగచ్ఛన్ తర్హి యూయం ఏవ గచ్ఛత ).

3. పిమ్మట నేనును అక్కడికి రాగలను.

( అనంతరం అహమపి తత్ర ఆగమిష్యామి ).

4. వారిపుడు భోజనమునకు వత్తురో, రారో, అడుగుము.

( తే ఇదానీం భోజనార్థం ఆగమిష్యంతి వా ,

న వా పృచ్ఛ).

5. మీరే అడుగుడు.

( యూయమేవ పృచ్ఛత ).

6. మీరు ఊరకుండుడు ; వారే వచ్చెదరు.

( యూయం తూష్ణీం స్త ; తే ఏవ ఆగమిష్యంతి ).

7. మిమ్ము ఎవరు భోజనమునకు పిలిచినారు ?

( యుష్మాన్ కే భోజనార్థం ఆహ్వయన్ ? ).

8. మీ అన్న పిలిచినాడుగా.

( తవ అగ్రజః ఆహ్వయత్ వా ).

9. మా అన్న ఊరిలోనే లేడే ; ఎట్లు పిలిచెను ?

(మమ అగ్రజః గ్రామే నైవ ఆసీత్; కథం ఆహ్వయత్ ? ).

10. వాడీవేళ వచ్చినాడని మా తమ్ముడు మా ఇంటిలో

చెప్పినాడు.

( సః అద్య ఆగచ్ఛత్ ఇతి మమ అనుజః అస్మద్గృహే అవదత్ ).

29. ఏకోనత్రింశః పాఠః ( ఇరువది తొమ్మిదవ పాఠము ).

పదములు.

అస్మాన్ = మమ్ము.

వృక్షాత్ = చెట్టునుండి, చెట్టువల్ల, చెట్టుకంటె.

వృక్షేభ్యః = చెట్లనుండి, చెట్లవల్ల, చెట్ల కొరకు.

ఆహూయ = పిలిచి.

పాతుం = త్రాగుటకు.

పృష్ట్వా = అడిగి.

పాస్యతి. = త్రాగ గలడు.

పతతి = పడుచున్నాడు.

చరతి = నడుచుచున్నాడు.

పదముల ప్రయోగము.

1. కిం అరే క్షీరం పాస్యసి కిం ?

( ఏరా ! పాలను త్రాగుతావా ?).

2. బాలకః వృక్షాత్ అపతత్/

( బాలుడు వృక్షము నుండి పడెను ).

3. త్వం తత్ర మా గచ్ఛ/

( నీవు అక్కడికి వెళ్ళవద్దు ).

4. తే బాలకాః దౌష్ట్యం కరిష్యంతి/

( ఆ బాలురు అల్లరి చేయగలరు ).

5. బ్రాహ్మణాః స్నానం కృత్వా తటాకాత్ ఆగచ్ఛంతి/

( బ్రాహ్మణులు స్నానము చేసి చెరువు నుండి వచ్చుచున్నారు ).

6. అనంతరం భోజనం కరిష్యంతి/

( తరువాత భోజనము చేయగలరు ).

7. అహమపి స్నానార్థం గచ్ఛామి/

( నేనును స్నానం చేయుటకు వెళ్ళుచున్నాను ).

8. భోజనార్థం ఆలస్యం మా కురుత/

(భోజనానికి ఆలస్యం చేయకండి ).

9. తవ జనకః ఏతావత్పర్యంతం గ్రామాత్ నాగచ్ఛత్/

(నీ తండ్రి ఇంతవరకు ఊరినుండి రాలేదు ).

10. శ్వః ఆగమిష్యతి కింవా ; తవానుజం ప్రక్ష్యసిచేత్ సః వదిష్యతి/

( రేపు వస్తాడేమో నీ తమ్ముడిని అడిగితే వాడు చెప్పగలడు ).

అభ్యాసము.

ఈ క్రింది తెలుగు వాక్యములను సంస్కృతంలో వ్రాయండి.

1.ఆ పిల్లవానిని పాలు త్రాగుటకు పిలువుము.

2. అక్కడ నా మంచమున్నదిగాని ఇటు తీసికొని రమ్ము.

3. నేను తీసికొని రాజాలను.

4. మీ తమ్ముడు తీసికొని రానిమ్ము.

5. నీవు పిల్లవానిని అడిగి అక్కడకు వెళ్ళుము.

6. ఆ పిల్లలు అల్లరి చేయుచున్నారు.

7. మాయొక్క పండ్లను ఎవరు తిన్నారు ?

8. మీరే తిన్నారుగా.

9. అయ్యో ! చెట్లనుండి పండ్లు పడ్డవి.

10. మీ చెంబులో కొంచెము పాలున్నచో నేను త్రాగెదను.

(సశేషం)

శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

shiva005.jpg

నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం
పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ |
నగేంద్రకన్యావృషకేతనాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || ౧ ||

నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం
నమస్కృతాభీష్టవరప్రదాభ్యామ్ |
నారాయణేనార్చితపాదుకాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || ౨ ||

నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం
విరించివిష్ణ్వింద్రసుపూజితాభ్యామ్ |
విభూతిపాటీరవిలేపనాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || ౩ ||

నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యాం
జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యామ్ |
జంభారిముఖ్యైరభివందితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || ౪ ||

నమః శివాభ్యాం పరమౌషధాభ్యాం
పంచాక్షరీపంజరరంజితాభ్యామ్ |
ప్రపంచసృష్టిస్థితిసంహృతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || ౫ ||

నమః శివాభ్యామతిసుందరాభ్యాం
అత్యంతమాసక్తహృదంబుజాభ్యామ్ |
అశేషలోకైకహితంకరాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || ౬ ||

నమః శివాభ్యాం కలినాశనాభ్యాం
కంకాలకల్యాణవపుర్ధరాభ్యామ్ |
కైలాసశైలస్థితదేవతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || ౭ ||

నమః శివాభ్యామశుభాపహాభ్యాం
అశేషలోకైకవిశేషితాభ్యామ్ |
అకుంఠితాభ్యాం స్మృతిసంభృతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || ౮ ||

నమః శివాభ్యాం రథవాహనాభ్యాం
రవీందువైశ్వానరలోచనాభ్యామ్ |
రాకాశశాంకాభముఖాంబుజాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || ౯ ||

నమః శివాభ్యాం జటిలంధరాభ్యాం
జరామృతిభ్యాం చ వివర్జితాభ్యామ్ |
జనార్దనాబ్జోద్భవపూజితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || ౧౦ ||

నమః శివాభ్యాం విషమేక్షణాభ్యాం
బిల్వచ్ఛదామల్లికదామభృద్భ్యామ్ |
శోభావతీశాంతవతీశ్వరాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || ౧౧ ||

నమః శివాభ్యాం పశుపాలకాభ్యాం
జగత్రయీరక్షణబద్ధహృద్భ్యామ్ |
సమస్తదేవాసురపూజితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || ౧౨ ||

స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం
భక్త్యా పఠేద్ద్వాదశకం నరో యః |
స సర్వసౌభాగ్యఫలాని భుంక్తే
శతాయురాంతే శివలోకమేతి || ౧౩ ||

ఇతి శ్రీమచ్ఛంకరాచార్యకృతం శ్రీ ఉమామహేశ్వర స్తోత్రం సంపూర్ణం |

bottom of page